
*కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా
ఆకేరున్యూస్ జనగామ ః ప్రతి ఉద్యోగి తన విధుల నుంచి ఏదో ఒక రోజు విశ్రాంతి తీసుకోక తప్పదని, ఉద్యోగ జీవితంలో ప్రజలతో మమేకమై పనిచేసిన ఉద్యోగులు పదవి విరమణ పొందడం ఒకింత బాధకరమే అయినప్పటికి విశ్రాంత జీవితాన్ని తమ కుటుంబానికి వెచ్చించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా అభిప్రాయపడ్డారు. విధి నిర్వహణ లో వారి బాధ్యతనే వారికి గుర్తింపు ఇస్తుందని అన్నారు. ఉద్యోగంలో బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడు జీవితంలో ఎంతో సంతృప్తి మిగులుతుందని వివరించారు. మంగళవారం కలెక్టరేట్ ఏవో మన్సుర్ , డి టి. ఓ నరసింహారెడ్డి , వాచ్మెన్ సోమయ్య పదవీ విరమణ సందర్బంగా ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్ లతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగ జీవితం ఒక మధురానుభూతి అని అన్నారు. ఇన్నిరోజులు సేవలను అందించి ఈరోజుతో వీరి సేవలు ముగియడం బాధాకరమైన అయినప్పటికీ విధి నిర్వహణ లో ఉండే ఎన్నో బాధ్యతలు, ఒత్తిడి వల్ల ఉద్యోగులకు కుటుంబ సభ్యులతో గడపడం వీలు ఉండదన , ఇక ఈ పదవీ విరమణ తరువాత ఆనందం గా కుటుంబ సభ్యులతో గడపాలని కోరుతున్నానని తెలిపారు. బాధ్యతయుతం గా పని చేసిన ఉద్యోగులను ఎప్పటికి మర్చిపోలేమని, వారి పట్ల గౌరవం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ సందర్బంగా వివిధ శాఖల అధికారులు వారితో ఉన్న సన్నిహిత్యాన్ని, అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ లు, ఆర్డీఓ లు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
…………………………………….