* రెండు నాల్కల ధోరణికి నిదర్శనమన్న ఎమ్మెల్సీ కవిత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇది రైతు ప్రభుత్వమని, రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పుకుంటున్న రేవంత్ ప్రభుత్వం మరోవైపు.. రైతుల భూముల వేలానికి యత్నిస్తోందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆరోపించారు. ఇది కాంగ్రెస్ సర్కారు రెండో నాల్కల ధోరణికి నిదర్శనమన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో, అంకోల్ తండా(ANCOL THANDA) ప్రజలను ఆదుకుంటానని నమ్మించి.. ఇప్పుడు రైతులను అప్పు చెల్లించాలంటూ వేధించడం, రైతులకు రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న నమ్మక ద్రోహానికి నిదర్శనమన్నారు. ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నికలలో గెలిచాక మరో మాట.. ఇదీ రేవంత్ రెడ్డి గారి రెండు నాల్కల ధోరణి అంటూ ఎక్స్(X) వేదికగా మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, దుర్కి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లిలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఎన్నికల ముందు ఓ మాట.. ఎన్నికలలో గెలిచాక మరో మాట.. ఇదీ రేవంత్ రెడ్డి (REVANTHREDDY)గారి రెండు నాల్కల ధోరణి.. అంటూ కవిత ట్వీట్(TWEET) చేశారు.
………………………………………….