* స్థానిక ఎన్నికలపై క్లారిటీ
* డిసెంబర్లో మూడు విడతల్లో ఎన్నికలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
ఈనెల 25న మంత్రి వర్గ సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు క్యాబినెట్ మీటింగ్ ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 1 నుంచి 9 వరకు అభివృద్ధి, సంక్షేమంపై వారోత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు. తెలంగాణ 2047 లక్ష్యాలపై చర్చించి స్థానిక ఎన్నికలపై క్లారిటీ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ మూడో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
