
* రోబోతో సీఎం ముచ్చట్లు.. ఎక్కడ.. ఏం మాట్లాడారంటే?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో షీల్డ్ – 2025 (Shield – 2025) పేరుతో సదస్సు జరిగింది. సైబర్ భద్రతకు సంబంధించిన నిపుణులు సదస్సులో పాల్గొన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్నందున అవగాహన చాలా అవసరమని సైబర్ సెక్యూరిటీ వింగ్ (Cyber Security Wing) చెబుతోంది. గతేడాది దేశవ్యాప్తంగా 22,812 కోట్ల విలువైన సైబర్ నేరాలు జరిగినట్లు అధికారులు వివరించారు. సైబర్ నేరగాళ్ల ఖాతాలను ఫ్రీజ్ చేసి 17,912 మంది బాధితులకు రూ. 183 కోట్లు చెల్లించినట్లు వివరించారు. షీల్డ్ – 2025ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. ఈ సదస్సులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సదస్సులో ఐటీ నిపుణులు ఏర్పాటు చేసిన రోబోతో సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanthreddy), మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu)మాట్లాడారు. వారికి రోబో షేక్ హ్యాండ్ ఇచ్చింది. హాయ్ సర్.. అని పలకరించింది. ఆ రోబోను ఆసక్తిగా తిలకించిన రేవంత్.. అధికారులను అడిగి రోబో విశేషాలను తెలుసుకున్నారు.
…………………………………..