* ఎంపీ రఘునందన్‌రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్: బౌన్సర్ల దుకాణం పెట్టిందే రేవంత్ రెడ్డి అని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ప్రయివేటు బౌన్సర్లను తీసుకువచ్చే సంస్కృతి రాష్ట్రానికి తీసుకొచ్చిందే రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు చుట్టూ బౌన్సర్లని పెట్టుకొని జనాలను పక్కకు నెట్టే కార్యక్రమం మొదలు పెట్టిందే రేవంత్ రెడ్డి అన్నారు. అల్లు అర్జున్ పంచాయితీలో బౌన్సర్లను ఎందుకు తీసుకొస్తున్నారని రఘునందన్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు చిత్తశుద్ధి ఉంటే బౌన్సర్ల వ్యవస్థను మొత్తం రద్దు చేయమని చెప్పండని ఎంపీ రఘునందన్ రావు సూచించారు.
……………………………………………