
* ఖర్గే ఏఐసీసీ డమ్మీ అధ్యక్షుడు
* దళితుల పట్ల కాంగ్రెస్‌ది, రేవంత్ రెడ్డిది మొసలి కన్నీరే..
* దమ్ముంటే దామోదరను లేదా వివేక్‌ను ముఖ్యమంత్రిని చేయండి
* కాంగ్రెస్‌కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్
ఆకేరు న్యూస్, కరీంనగర్ : బిల్లా రంగా అని తమ నేతలను సంబోధించడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి (Revanthreddy) స్థాయిని తగ్గించుకున్నారని, ఆయన బిర్లా రంగాలనే కాదు.. చార్లెస్ శోభరాజ్ ను మించిపోయారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eswar) విమర్శలు చేశారు. కరీంనగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్‌రావును విమర్శించడం తగదన్నారు. మహేశ్ కుమార్ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా మమ్మల్ని అడిగి చేశారా అని నిలదీశారు. ఆ పదవి దళితుడికి ఎందుకు ఇవ్వలేదని మేమైనా ప్రశ్నించామా అన్నారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్నిఅభివృద్ధి చేసే విజన్‌ను సిద్దం చేసుకున్న కేసీఆర్ (Kcr) సీఎం అయితేనే మంచిదని తెలంగాణ కోరుకుందన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయినంక రాష్ట్ర పరిస్థితి ఏమైందో చూస్తునే ఉన్నామని అన్నారు. ఖర్గే (Kharge) ఏఐసీసీ డమ్మీ అధ్యక్షుడని, నడిపేదంతా రాహుల్ గాంధీ (RahulGandhi) అని విమర్శించారు. దళితుల పట్ల కాంగ్రెస్‌ది, రేవంత్ రెడ్డిది మొసలి కన్నీరే అన్నారు. 1985 నుండి ఇప్పటి వరకు ఎంతమంది దళితులను కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా చేసిందని, 98 మంది ప్రెసిడెంట్లలో కనీసం నలుగురు దళితులు లేరని ఎద్దేవా చేశారు. పీవీని కనీసం పోగు పోయనివ్వలేదు.. మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేసి, చైర్మన్ గా సోనియా గాంధీ అసలు అధికారం వెలగబెట్టిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే దామోదర రాజనరసింహను లేదా వివేక్ వెంకటస్వామిలను ముఖ్యమంత్రిని చేయాలని సవాలు చేశారు.
……………………………………….