
* ఆ లోపు మహిళలకు ఇచ్చన హామీలపై స్పష్టమైన ప్రకటన రావాలి
* ఆ తర్వాత 10 వేల మంది మహిళలం.. 10 వేల గ్రామాలకు వెళ్తాం..
* లక్షలాది పోస్టుకార్డులు తయారుచేసి సోనియాగాంధీకి పంపుతాం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC KAVITHA) మార్చి 8 వరకు డెడ్ లైన్ విధించారు. ఈమేరకు ఆయనకు 10 వేల పో్స్టుకార్డులు పంపించారు. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోస్టు కార్డు ఉద్యమం మొదలుపెట్టారు. ఈమేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం (CONGRESS GOVERNMENT)ఎన్నికల సమయంలో ప్రజలపై హామీల జల్లు కురిపించిందని,ప్రతి ఒక్కరికీ అరచేతిలో వైకుంఠం చూపిందని, తీరా అధికారం వచ్చాక రాష్ట్రమంతా అంధకారమేనని విమర్శించారు.. ఒక్క హామీని కూడా పూర్తి నెరవేర్చలేదన్నారు.. పలు హామీలను తూతూ మంత్రంగా ప్రారంభించారు. ప్రతి లబ్ధిదారుడికి అందిస్తామన్న పథకాలు.. కొందరికి మాత్రమే దక్కుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో మహిళలు తీవ్రంగా మోసపోయారు. ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి కాంగ్రెస్.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదు. వాటిని సాధించడమే తన లక్ష్యమని ప్రకటించారు. ఇందుకోసం పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలతో సమావేశమయ్యారు. మార్చి 8 లోపు మహిళలకు ఇచ్చిన హామీలపై రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయకపోతే, ఆ తర్వాత 10 వేల మంది మహిళలం.. 10 వేల గ్రామాలకు వెళ్తామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పారు. లక్షలాది పోస్టుకార్డులు తయారుచేసి సోనియాగాంధీ(SONIA GANDHI)కి పంపుతామని చెప్పారు.
…………………………………………