* మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటు విమర్శలు
ఆకేరున్యూస్, సంగారెడ్డి: సీఎం రేవంత్ రెడ్డివి బ్లాక్మెయిల్ రాజకీయాలని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని సీఎం చేసిన తప్పుడు ఆరోపణలపై హరీశ్‌రావు స్పందించారు. గురువారం అందోల్ మండలం మాసాన్‌పల్లిలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశాడు. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్లు కబ్జాలు చేసే చరిత్ర రేవంత్ రెడ్డిదని ధ్వజమెత్తారు. ఒక గుంట కానీ, ఒక ఎకరా కానీ ఇరిగేషన్ భూమి కానీ, ప్రభుత్వ భూమి కానీ తీసుకున్నట్టు నా చరిత్రలో లేదని స్పష్టం చేశారు. ఏ భూమిని అయితే నేను రిజిస్టేష్రన్ చేసుకున్నానో ఆ భూమిలోనే ఉన్నానని.. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు రేవంత్ రెడ్డి.. నీ సమక్షంలోనే సర్వే చేద్దామన్నారు.
……………………………………..