
* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో భారీ స్కామ్ కు తెరలేపారని బీఆర్ ఎస్ వర్కింగ్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. టీడీఆర్ పేరుతో వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి టీం (CM REVANTHREDDY TEAM)సిద్ధమవుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఎఫ్ ఎస్ ఐ అమలు చేసి, అడ్డగోలు ధరలకు హైదరాబాద్ టీడీఆర్ (HYDERABAD TDR) షేర్లు అమ్మేందుకు కుట్ర జరుగుతోందన్నారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని తెలిపారు. ఎల్లుండి గవర్నర్ ప్రసంగానికి వస్తారని అన్నారు. తర్వాత కొన్ని కార్యక్రమాలకు కూడా కేసీఆర్ వస్తారని వివరించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పిచ్చి మాటలు వినడానికి కేసీఆర్ (KCR)రావొద్దు అనేది కొడుకుగా తన అభిప్రాయమని చెప్పారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్లో ఎవరూ సరిపోరని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో ఎవరూ వినడం లేదని అన్నారు. తన అనుచరుడు వేం నరేందర్ రెడ్డి(VEM NARENDAR REDDY)కి ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకోలేక పోయారని విమర్శించారు.
………………………………………………….