
* వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతా..
* రేవంత్‌ను ఎవరూ కాపాడలేరు
* ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ హెచ్చరిక
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించితీరుతానని ఎన్నికల వ్యూహకర్త జనస్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సవాల్ విసిరారు.ఇటీవల ఓ ఇంగ్లీష్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి, గతంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి కేసీఆర్ ది బిహారీ డీఎన్ ఏ అని తనది బిహారీ డీఎన్ ఏ కాదని తెలంగాణ డీఎన్ ఏ అని మాట్లాడారు.కేసీఆర్ కుర్మీ కులానికి చెందినవారని, వారి పూర్వీకులు బిహార్ నుండి విజయనగరానికి, ఆ తర్వాత తెలంగాణకు వలస వచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలకు ప్రజలు ఆ పదంతో ఇబ్బంది పడితే, దానికి మరో పదాన్ని ఉపయోగిస్తానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బిహారీలను కించపర్చే విధంగా ఉన్నాయని ఆయనకు తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్తామని ప్రశాంత్ కిశోర్ అన్నారు.వచ్చే ఎన్నికల్లో రేవంత్‌ను ఓడిస్తామని, రాహుల్ గాంధీ కాదు కదా, ఆయన్ను ఎవరూ రక్షించలేరని ప్రశాంత్ అన్నారు. తమ పార్టీని గెలిపించాలని కోరుతూ రేవంత్ రెడ్డి మూడుసార్లు తనను కలిసినట్లు ప్రశాంత్ కిషోర్ గుర్తు చేశారు. కానీ తామేమీ సాయం చేయలేదన్నారు.
………………………………………..