* మంత్రులతో రేవంత్ రెడ్డి భేటీ
* కీలక అంశాలు చర్చకు వచ్చే చాన్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ చీఫ్ నిన్న చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanthreddy) స్పందించనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ రూంలో ఆయన మంత్రులతో భేటీ కానున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ అమలు తీరుపై ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోనున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించనున్నారు. మునిసిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహక కార్యక్రమాలు, అనుసరించాల్సిన విధానాలపై మంత్రులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ప్రాజెక్టులను టార్గెట్ చేస్తూ కేసీఆర్ చేసిన ఆరోపణలపై మాట్లాడనున్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల ద్వారా దక్షిణ తెలంగాణకు కలిగే ప్రయోజనాలు, రైతులకు అందుతున్న నీటి వాటాలు, పండుతున్న పంటలపై చర్చించి ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది.
…………………………………………

