ఆకేరు న్యూస్, హైదరాబాద్ : శివరాజ్ పాటిల్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మృతి దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని అన్నారు. నైతిక విలువలు, హుందాతనంతో రాజకీయాలు చేసిన వ్యక్తి అయన అని తెలిపారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ప్రతినిధి నుంచి ఆయన రాజకీయాలు ప్రారంభించారని, వరుసగా 7 సార్లు లోక్ సభ ఎంపీగా ఎన్నిక కావడం గర్వకారణం అన్నారు. లోక్ సభ స్పీకర్గా, కేంద్ర హోం మంత్రిగా, పంజాబ్ గవర్నర్ గా ఆయన సేవలు ఎనలేనివని తెలిపారు. నిరుపేదల గురించి నిత్యం ఆలోచించే గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు.
…………………………………

