
* రాములోరికి పట్టువస్త్రాలు సమర్పించిన రేవంత్ రెడ్డి
* కనుల పండుగ సీతారామ కల్యాణంఆకేరు న్యూస్, భద్రాద్రి : భద్రాచలం సీతారామచంద్రుల వారి కల్యాణం కనుల పండువగా సాగింది. భద్రాద్రి ఆలయం(Bhadradri Temple) లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం ఉదయం నుంచే అర్చకులు సీతాసమేత శ్రీరాముల వారికి విశేష పూజలు నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు పెద్దఎత్తున భక్తులు భద్రాద్రికి చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revnthreddy) దంపతులు భద్రాద్రి రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం దంపతులకు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణ నడుమ ఘనస్వాగతం పలికారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తజనంతో భద్రాద్రి పులకించిపోయింది. కల్యాణం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటించారు. రేషన్ బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. బూర్గంపాడు మండలం సారపాకలో ఉంటున్న బూరం శ్రీనివాస్ ఇంటికి వెళ్లి భోజనం చేశారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల కూడా భోజనం తిన్నారు. అనంతరం ఆ కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
…………………………………