
డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
* ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఆకేరున్యూస్, డెస్క్ : రేవంత్ రెడ్డి ఆలోచనలు విశాల ప్రయోజనాలు కలిగి ఉంటాయని సంకుచితంగా ఉండవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(DEPUTY CM BHATTI VIKRAMARKA) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక రోజు పర్యటన కోసం విశాఖ వెళ్లిన భట్టి మీడియాతో మాట్లడారు. సీఎం రేవంత్ రెడ్డి ( CM REVANTH REDDY) రాష్ట్రానికి, పార్టీకి ఉపయోగపడే పనులు చేస్తారు తప్ప నష్టం చేసే పనులు చేయరు అన్నారు. ముఖ్యమంత్రిగా పార్టీ విధానాలు విశాలమైన ప్రయోజనాలతో ఉంటాయి తప్ప సంకుచితమైన మనస్తత్వంతో ఉండవన్నారు.మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ( MLA RAJ GOPAL REDDY) విషయం ప్రస్తావించగా రాజ గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలని కోరుకునే వారిలో ముందువరుసలో ఉంటారని వ్యాఖ్యానించారు.చంద్రబాబు, రేవంత్, రాహుల్ గురించి వైఎస్ జగన్ (YS JAGAN) హాట్ లైన్ వ్యాఖ్యలపై భట్టి స్పందిస్తూ అవి జగన్ వ్యక్తిగతమైన వ్యాఖ్యలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని అన్నారు,
తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసం
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే నదీ జలాల కోసం అని భట్టి స్పష్టం చేశారు.వరద జలాలపై ఇరు రాష్ట్రాల వాటా తేలిన తర్వాత కొత్త ప్రాజెక్టులు నిర్మించుకుంటే న్యాయబద్ధంగా ఉంటుందన్నారు. మా అవసరాలు తీరకుండా దిగువ ప్రాజెక్టులు నిర్మిస్తే..ఆ తర్వాత కేటాయింపుల సమస్యలు ఎక్కువవుతాయి’ అని భట్టి అభిప్రాయపడ్డారు.ఈ విషయంలో కేంద్రం చొరవచూపి సమస్యను ఉభయులకు యోగ్యంగా ఉండే విధంగా పరిష్కరించాలని కోరారు.ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్, దేవాదులు వంటి గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని.. ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత వాటాలు తేల్చి మిగిలిన వాటిని సమృద్ధి గా వాడుకోవచ్చని ఆయన అన్నారు.
…………………………………………