* వరంగల్ కాంగ్రెస్ లో భగ్గుమన్న వర్గ విభేదాలు
* దసరా ఫ్లెక్సీలో మంత్రి ఫోటో లేదంటూ కొండా వర్గీయుల ఆగ్రహం
* రేవూరి వర్గీయులపై కొండా వర్గీయుల దాడి
* దాడి చేసిన కొండా వర్గీయులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆకేరు న్యూస్ , వరంగల్ : వరంగల్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా భగ్గు మన్నాయి . ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి , మంత్రి కొండా సురేఖ వర్గీయుల మద్య కొంత కాలంగా విభేధాలు నివురు గప్పిన నిప్పులాగా ఉన్నాయి.. బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ఫ్లెక్సీల్లో తమ నాయకుల ఫోటోలు లేవంటూ ఘర్షణ తలెత్తింది. మంత్రి కొండా వర్గీయులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల పై తీవ్ర స్థాయిలో దాడి చేశారు ..దీంతో పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు..అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిపై పోలీస్ లు విచక్షణా రహితంగా దాడి చేశారని కొండా వర్గీయులు ఆరోపిస్తున్నారు .. మాల ధారణ లో ఉన్న వారిని కూడా అరెస్ట్ చేశారంటున్నారు .. విషయం తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ గీసుకొండ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పోలీస్ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు..తమ అనుచరుల పై దాడి చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు..
ధర్నాలతో దద్ధరిల్లిన గీసుకొండ
పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని , అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని కొండా వర్గీయులు ఆందోళన బాట పట్టారు . గీసుకొండ లోని ధర్మారం గేటు వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు .. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా కొండా వర్గీయుల దాడిలో గాయపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరామర్శించారు..
————–