
* మావోలు, భద్రతా దళాల మధ్య కాల్పులు
* ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దు దండకారణ్యంలోని కర్రెగుట్ట(Karregutta)ల్లో అలజడి వాతావరణ ఏర్పడింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ (Chathisghad-Beejapur)జిల్లాల్లో ఎన్ కౌంటర్ జరిగింది. ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కోబ్రా(Cobra), డీఆర్జీ(Drg), సీఆర్పీఎఫ్(Crpf), ఎస్టీఎఫ్ (Stf) బలగాలతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు బస్తర్ పోలీసులకు సమాచారం అందింది. 3 వేల మందికి పైగా భద్రతా సిబ్బందితో మూడు రోజులుగా జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా తనిఖీలు, కూంబింగ్ చేపడుతున్నాయి. ఈక్రమంలో ఆపరేషన్ కు వెళ్లిన బృందానికి మావోయిస్టులు కనిపించడంతో ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు మొదలయ్యాయి. అలాగే, భీమవరం పాడు, కాంకేర్, పామేరు అటవీ ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఆపరేషన్ తో ఆ ప్రాంతంతో అలజడి వాతావరణం ఏర్పడింది. కర్రెగుట్ట దండకారణ్యంలోని అటవీ ప్రాంతాలను కలిపే మార్గాలను నిలిపివేసి, భద్రతా దళాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి.
…………………………………………………