
* రెండు రోజులుగా గాలిస్తున్న పోలీసులు
* సారంగపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి
ఆకేరు న్యూస్ డెస్క్ : కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు . పలు చోరీల్లో నిందితుడైన రియాజ్ ను సీసీఎస్ ఎస్సై భీమ్రావు, కానిస్టేబుల్ ప్రమోద్ లు కలిసి రెండు రోజుల క్రితం ద్వి చక్ర వాహనంపై తీసుకెళ్తుండగా ముందు ఉన్న కానిస్టేబుల్ ను వెనక నుంచి కత్తితో పొడిచి అడ్డుకున్న ఎస్సై భీమ్ రావ్ ను ప్రతిఘటించి పరారైన విషయం తెల్సిందే. ఈ ఘటన పోలీస్ వర్గాల్లో సంచలనం రేపింది. ఈ ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. అయితే గత రెండు రోజులుగా పోలీసుల కళ్లల్లో కారం చల్లి తిరుగుతున్న రియాజ్ ఆదివారం నిజిమాబాద్ జిల్లా సారంగపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు.
…………………………………………………..