* ఆస్పత్రిలో పోలీసులపై తిరగబడ్డ రియాజ్
* ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కుని కాల్పులకు ప్రయత్నం
* ఆత్మ రక్షణ కోసం పోలీసుల ఎదురు కాల్పులు
* పోలీసుల కాల్పుల్లో రియాజ్ మృతి
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : ఈ నెల 17 న కానిస్టేబుల్ ప్రమోద్ ను చంపి పరారీలో ఉన్న కరుడుకట్టిన నేరస్థుడు రియాజ్ పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. ఆదివారం నాడు రియాజ్ను సారంగపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నప్పటికీ తీవ్ర గాయాలు కావడంతో అతడిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అతడికి చికిత్స అందిస్తున్న క్రమంలో సెక్యూరిటీగా ఉన్న ఏ ఆర్ కానిస్టేబుల్ గన్ ను లాక్కుని అతడిపై కాల్పులు జరిపే సాహసం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే రియాజ్ పై కాల్పులు జరుపడంతో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. పలు నేరాలు వాహపాల దొంగతనాల్లో నిందితుడు గా ఉన్న రియాజ్ ను ఈ నెల 17
పోలీసులు అరెస్ట్ చేశారు.అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ ప్రమోద్ ను కత్తితో పొడిచి ప్రతిఘటించిన ఎస్సైపై దాడి చేసి పారిపోయాడు. ఈ క్రమంలో ఆస్పత్రికి తరలిస్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందాడు.ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. షేక్ రియాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సారంగపూర్లోని అటవీ ప్రాంతంలో పడివున్న ఓ పాడుబడిన లారీలో దాక్కుని ఉండగా పోలీసులకు పట్టుకున్నారు. ఆ సమయంలో పోలీసుల నుంచి పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతనికి గాయాలు కావడంతో ఆదివారం రాత్రి నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు.నిజామాబాద్ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న సమయంలో ఆస్పత్రి నుంచి పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. సోమవారం తన పక్కనే ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ మరణించాడు.
ఆత్మరక్షణ కోసమే ఎన్ కౌంటర్ : డీజీపీ శివధర్ రెడ్డి
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ మళ్లీ పోలీసులపై తిరగబడ్డాడని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
ఆస్పత్రి లో అతడికి సెక్యూరిటిగా ఉన్న ఏ ఆర్ కానిస్టేబుల్ గన్ ను లాక్కుని అతడిపై కాల్పులకు ప్రయత్నం చేశాడని డీజీపీ తెలిపారు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం రియాజ్ పై కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు. ఈ కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరించారు.
……………………………………….
