* రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీల దుర్మరణం
* కరీంనగర్లో ఆగి ఉన్న వ్యాన్ను ఢీకొట్టిన లారీ
ఆకేరు న్యూస్, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురు కూలీల ఉసురు తీసింది. మహారాష్ట్ర నుంచి 23 మంది కూలీలతో కరీంనగర్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న వ్యాన్ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. జైపూర్ మండలం ఇందారం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో 11 మందికి గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బొలొరో డ్రైవర్ కాలకృత్యాల కోసం రోడ్డు క్కన వాహనాన్ని ఆపడంతో వెనక నుండి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………………………………………………..

