
*మంత్రి ధనుసరి అనసూయ సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: గ్రామీణ ప్రాంతాలతో పాటు జిల్లా మండల కేంద్రాలలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి 163 నుంచి మదనపల్లి క్రాస్ రోడ్డు వరకు రూ. నాలుగు కోట్లతో ఏర్పాటు చేయనున్న రోడ్డు వెడల్పు, డివైడర్, సెంటర్ లైటింగ్ పనులను జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ లతో కలిసి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడమే కాకుండా ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించిందని వివరించారు. ఇప్పటికే జిల్లా కేంద్రం నుంచి పలు గ్రామాలకు వెళ్లే రహదారులను విస్తరించి పనులను పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. బతుకమ్మ పండుగ వరకు రోడ్డు పనులను, నాణ్యత లోపించకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలోమునిసిపల్ కమిషనర్ సంపత్, పంచాయతీ రాజ్ ఈ ఈ అజయ్ కుమార్, తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………….