* గుజరాత్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రమాదాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : వేర్వేరు రాష్ట్రాల్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఏకంగా 13 మంది దుర్మరణం చెందారు. 16మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఛత్తీస్ గఢ్ (CHATHIGHAD) రాష్ట్రంలోని బలోద్ జిల్లాలో దౌండీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ఒకటి కారు కాగా, మరొకటి ట్రక్కు. అయితే ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం రాజ్ నంద్ గావ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. చనిపోయిన వారిని దుర్పత్ ప్రజాపతి, యువరాజ్ సాహు, సుమిత్రా బాయి, మనీషా కుంభకర్, సగుస్ బాయి, ఇమ్లా బాయిగా పోలీసులు గుర్తించారు.
గుజరాత్లో..
గుజరాత్ (GUJARATH) రాష్ట్రం భావ్నగర్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. పది మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. ట్రక్కును బస్సు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదంలో జరిగింది. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
………………………………………………….