
* వేర్వేరు ప్రమాదాల్లో అయిదుగురు దుర్మరణం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. మహబూబాబాద్ జిల్లా (Mahaboobabad District) కొత్తగూడ మండలం పెగడపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున పెగడపల్లి వద్ద ఆటో, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతిచెందారు. మరో ఘటనలో మేడ్చల్ జిల్లా (Medchal District) దుండిగల్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మరణించారు. దుండిగల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బైకును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లా (Karimnagar District) తిమ్మాపురం మండలం రేణికుంట రహదారిపై కూడా గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఆరుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. మృతుడిని కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామానికి చెందిన కాస్లర్ల తిరుపతిగా పోలీసులు గుర్తించారు.
……………………………………………