* పరువు నిలుపుకున్న భారత్
* చివరి వండేలో ఆస్ట్రేలియాపై ఘన విజయం
* ఫాంలోకి వచ్చిన కోహ్లీ
ఆకేరు న్యూస్ స్పోర్ట్స్ డెస్క్ : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు విజృంభించడంతో చివరి వన్డే భారత్ వశమయైంది. మూడు వన్డే సిరీస్లో మొదటి రెండు వన్డేలు ఓడి సిరీస్ ను కోల్పోయిన భారత్ చివరి వన్డే అగ్నిపరీక్షగా మారింది. ఆడిలైడ్,పెర్త్ లో జరిగిన రెండు వన్డేల్లోనూ భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఖంగుతిన్నది. కనీసం చివర వండేలోనైనా భారత్ పరువునిలుపుకుంటుందా లేదా అని క్రికెట్ అభిమానులు ఎదురు చూశారు. రోహత్ శర్మ, విరాట్ కోహ్లీలు చెలరేగి ఆడడంతో 9 వెకెట్ల తేడాతో భారత్ ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 236 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ పేస్ బౌలర్ హర్షత్ రాణా 39 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాజ్ గెలవాలంటే భారత జట్టు 237 పరుగులు సాధించాల్సి ఉంటుంది. 237 టార్గెట్ తో కెప్టెన్ గిల్, రోహిత్ శర్మలు బరిలోకి దిగారు. గిల్ 24 పరుగుల వద్ద హేజల్ వుడ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ గా మైదానంలోకి వచ్చిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మకు జతకూడి చెలరేగిపోయాడు. మొదటి రెండు మ్యాచుల్లో సున్నాకే అవుటై అభిమానులను నిరాశపరిచిన కోహ్లి చివరి వన్డేలో 74 పరుగులు చేసి నాటౌట్ గానిలచాడు. మరో వైపు రోహిత్ శర్మ 121 తో అజేయంగా నిలిచాడు. ఇద్దరు కలిసి 237 టార్గెట్ ను పూర్తి చేశారు. 2-1 తేడాతో సిరీస్ ముగిసింది.
………………………………………..
