
HYDERABAD, AUG 7 (UNI):- Telangana Handlooms/Textiles and Agriculture, Marketing Co-operation, Minister, Tummala Nageswara Rao, inaugurating Handloom Exhibition on the occasion of National Handloom Day, in Hyderabad on Wednesday. UNI PHOTO-12U
* హైదరాబాద్ లో చేనేత వస్త్ర ప్రదర్శన
ఆకేరున్యూస్,హైదరాబాద్ : దేశానికి అన్నం పెట్టే రైతన్నల..నేతన్నల సంక్షేమం చూసే అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి ( CM REVANTH REDDY) కి రుణపడి ఉంటానని వ్యవసాయ,సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (THUMMALA NAGESHWER RAO) అన్నారు. జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా హైదరాబాద్ లోని నక్లెస్ రోడ్ లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో గురువారం చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత పరిశ్రమ (HANDLOOM EXIBITION)అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం హయాంలో నిరాదరణకు గురైన చేనేత పరిశ్రమకు తిరిగి పూర్వవైభవం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా చేనేత స్టాళ్లను, ఉత్పత్తులను పరిశీలించారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్లోని వస్త్రాలను పరిశీలించి అభినందించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత అవార్డుకు ఎన్నికైన వారు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ అథ్లెంటిక్ వీవ్స్ లోగో, త్రిలింగా చీరను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ (SHIALAJA RAMAYYAR) మాట్లాడుతూ అంతరించిపోతున్న చేనేత కళలన్నింటికి పునఃవైభవం తెచ్చేలా కృషి చేస్తుందని చెప్పారు. మార్చిలో ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా చేనేత రుణమాఫీ కోసం రూ.33 కోట్లు విడుదల చేశామన్నారు.చేనేత కుటుంబాలకు భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో మరణించిన నేతన్నల కుటుంబసభ్యులకు ఐదు లక్షల ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు.
……………………………………….