
* భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం
* మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఆకేరు న్యూస్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే మూడు రోజులు భారీ వర్షాల దృష్య్టా అప్రమత్తంగా ఉండి జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సెక్రటేరియట్ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. సీఎస్ కె.రామకృష్ణారావుతోపాటు జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. జిల్లాల్లోని పరిస్థతిని కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ముంపు, లోతట్టు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఆదేశించారు. అధికారుల సెలవులు రద్దు చేసి అందుబాటులో ఉండేలా చూసుకోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
…………………………………..