
* ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఆకేరు న్యూస్, హనుమకొండ : మేడారం జాతర ( MEDARAM JATHARA)నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం 5 కోట్ల నిధులను విడుదల చేసింది. వచ్చే సంవత్సరం జనవరి 28న మేడారం జాతర ప్రారంభం కానుంది. జనవరి 28నుంచి మూడు రోజుల పాటు ఈ జాతర ఉంటుంది. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర కావడంతో ఈ జాతరకు దేశంలోని పలు రాష్రాల నుంచి భుక్తులు అధికసంఖ్యలో హాజరవుతారు. భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం విడుదల చేసిన 5 కోట్లతో వీఐపీల కోసం గెస్ట్ హౌజ్ (GUEST HOUSE )ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికి నాలుగునూట్ల గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ (Vikas Raj) అనుమతులు ఇచ్చారు.మేడారం సమ్మక్క సారలమ్మ ( SAMMAKKA SARALAMMA)జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు (Better facilities) కల్పించే దశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మహా కుంభమేళాను తలపించే ఈ జాతర కోసం అధికారులు అప్పుడే ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. మంత్రి సీతక్కనియోజకవర్గ పరిధిలో ఉంది కాబట్టి ఈ జాతర పై మంత్రి సీతక్క ( MINISTER SEETHAKKA )ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. సుమారు కోటి మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి జాతరలో తాగునీటి ( DRINKING WATER ) సరఫరా, మరుగుదొడ్ల ఏర్పాటు, విద్యుత్ శాఖ సేవలు, రోడ్ల మరమ్మతులపై మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
………………………………………