RTC Driver Ashok Controversy
* ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
* అశోక్ ఉద్యోగానికి ఏ ఆపద లేదు
– మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్, కరీంనగర్ : ప్రభుత్వ వ్యతిరేకంగా ఆయన ఉద్యమాలు చేయలేదు.. ప్రభుత్వ పనితీరు ను నిరసిస్తూ నినాదాలు చేయలేదు. ఆయన మాట్లాడిందల్లా రైతుల గురించి .. ఎండకు ఎండి పోతున్న రైతన్న ధాన్యం దైన్యం గురించి .. అంతే పాలకుల పార్టీ కన్నెర్ర జేసింది.. అధికారులు ఆయన ఉద్యోగం నుంచి తొలగించారు. అసలు విషయం ఏంటంటే..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా జగిత్యాల ఆర్డీవో ఆఫీస్ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్నారు . అటుగా వెళుతున్న ఆర్టీసీ డ్రైవర్ అశోక్ వాళ్ళను ఉద్దేశించి పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి తర్వాత ఆందోళన చేయొచ్చు కానీ.. ముందు వడ్లు, మక్కలు గురించి పట్టించుకోండి ..అని ముందుకు వెళ్లాడు.. అశోక్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో ఒక్క సారిగా వైరల్ అయింది.
దీంతో ధర్మపురి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ సీ లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు ఆయనను విధుల నుంచి తొలగిస్తున్నట్లు జగిత్యాల డిపో మేనేజర్ ఆదేశాలు జారీ చేశారు.
* వర్షం వస్తే రైతులు ఆగం అయితరని చెప్పిన
ఆర్టీసీ డ్రైవర్ ఆశోక్
నేను బస్సు నడుపుకుంటూ వస్తున్న. వాళ్లు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తున్నరు. నేను అక్కడే సైడ్‌కు ఆగిన. అక్కడ మా ఊరు ఆయన ఉన్నడు. డ్రైవింగ్‌లో ఉన్న కానీ బస్సును పక్కకు ఆపి మజ్జిగ ప్యాకెట్లు ఇస్తుంటే తీసుకున్నా. అక్కడున్నాయను ఏం చేస్తున్నరు అని అడిగితే పెట్రోల్, డీజిల్ ధరల గురించి మాట్లాడుతున్నమంటే.. దాని గురించి కాదు.. రైతులు పరేషాన్ అయితుర్రు ముందు వడ్లు, మక్కల గురించి మాట్లాడుర్రి అని చెప్పి వెళ్లిపోయిన గంతే. ఏ రాజకీయ నాయకుడి పేరు తీయలేదు. ఏ పార్టీ గురించి మాట్లాడలేదు. ఎవరి గురించి మాట్లాడలేదు.
* అశోక్ ఉద్యోగానికి ఏ ఆపద లేదు
– మంత్రి పొన్నం ప్రభాకర్
అశోక్ ఆర్టీసీ హైర్ బస్ లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆశోక్ మాటలను తప్పు పట్టడం లేదు.. స్వాగతిస్తున్నాం.. వడ్లు, మక్కలను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేస్తున్నాం.. కేంద్ర ప్రభుత్వం సహకరించక పోవడం వల్ల కొంత ఆలస్యమవుతోంది.. అయినా మరింత వేగంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.. అశోక్ అద్దే బస్సు డ్రైవర్ కావడం వల్ల బస్ యజమానితో మాట్లాడి తొలగించవద్దు అని చెప్పాం.. ఆయన ఉద్యోగానికి ఎలాంటి ఆపద లేదు. తప్పుడు ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను..
———————
ALSO READ :
Please tell us what is wrong. Your report will be sent to the website team.
