
* మయన్మార్‌లో వెయ్యికి పెరిగిన మృతుల సంఖ్య
* శిథిలాల కింద చిక్కుకున్న వందల మంది
* మృతుల సంఖ్య ఇంకా పెరిగే చాన్స్
* 1700 మందికి పైగా గాయాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : నిన్నటి భూకంపానికి మయన్నార్(Myanmar) మృత్యువిలయంగా మారింది. ఇప్పటికే వెయ్యికి పైగా మృతుల సంఖ్య పెరిగింది. శిథిలాల కింద ఇంకా వందల మంది చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే చాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. 1700 మందికిపైగా గాయాలపాలయ్యారు. వరుస భూకంపాలతో మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలు భూవిలయంతో బాధపడుతున్నాయి. భూకంప తీవ్రత(Earthquake effect) కు మయన్మార్ కకావికలమైంది. వరుసగా వచ్చిన ఆరు భూకంపాలు మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలను భయ కంపితులు చేశాయి. భూవిలయంతో బాధపడుతున్న మయన్మార్‌ను ఆదుకోవడం కోసం భారత్ ముందుకు వచ్చింది. మయన్మార్‌కు ఆపన్న హస్తం అందించింది. ఆపరేషన్ బ్రహ్మ(Operation Brahma) పేరుతో మయన్మార్ ప్రజలకు సాయం చేసేందుకు భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. 15 టన్నుల ఉపశమన పదార్థాలు అనగా ఆహారం, మందులు, జనరేటర్లు, దుప్పట్లు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, హైజీన్ కిట్లు వంటి అత్యవసరాలను మయన్మార్‌కు తరలించింది.
…………………………………………..