ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు విధి విధానాలు ఖరారు చేశారు. అభ్యర్థులు తప్పకుండా పాటించాల్సిన విధానాలపై రాష్ట్ర ఎన్నిక సంఘం విడుదల చేసింది. పంచాయతీ ఎన్నికల్లో రేషన్‌డీలర్లు పోటీ చేసుకోవచ్చని తెలిపింది. అంగన్వాడీ టీచర్లు, మతిస్థిమితం లేనివారు అనర్హులని ప్రకటించింది. వార్డు స్థానానికి పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీల నామినేషన్ రుసుం రూ.250, ఇతరులు రూ. 500 చెల్లించాలని, సర్పంచ్ అభ్యర్థులైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.1000, ఇతరులు రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అదే గ్రామం లో ఓటరుగా నమోదై ఉండాలని.. ప్రభుత్వ, స్థానిక సంస్థల్లో ఉద్యోగి పోటీ చేయాలంటే నామినేషన్‌కు ముందే రాజీనామా ఆమోదం పొంది ఉండాలని నిబంధన పెట్టింది. పోటీ చేసే అభ్యర్థులపై ఏవైనా కేసులు ఉండి.. నిర్ధారణ అయితే పోటీలో ఉండేదుందుకు వీలు ఉండదు.
………………………………………………….
