
* కాళేశ్వరం రిపోర్ట్ ఎఫెక్ట్..?
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : బీఆర్ ఎస్ (BRS)ముఖ్యనేతలందరూ ఎర్రవెల్లి ఫాం హౌజ్‌కు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు,(HARISH RAO)వేముల ప్రశాంత్ (VEMULA PRASHANTH REDDY)రెడ్డి,జగదీశ్ రెడ్డి (JAGADEESH REDDY) నిన్నటి నుంచి ఫాం హౌజ్ లోనే ఉండగా సోమవారం కేటీఆర్(KTR) పరుగుపరుగున ఫాం హౌజ్ కు చేరుకున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ (JUSTICE PC GHOSH) ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించారు. కాళేశ్వరం(KALESHWERAM PROJECT) పాపం కేసీఆర్ దే అని కమిషన్ నిగ్గుదేల్చింది. దానిపై నేడు రాష్ట్ర కేబినెట్ లో చర్చించి ఏం చేయాలనేదానిపై ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలిసింది.కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. రిపోర్ట్ కు సంబంధించిన కాపీలను సభ్యులందరికీ పంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడు రోజుల పాటు అసెంబ్లీలో పూర్తి స్థాయి చర్చ జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉంది. కాళేశ్వరం ప్రాజె క్టు విషయంలో అసలు ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేయాలా లేదా డైరెక్టుగా చర్యలు తీసుకోవాలా అనే దానిమీద ప్రభుత్వం న్యాయనిపుణులతో చర్చిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం ఒకే అంశంపై రాష్ట్ర కేబినెట్ సమావేశం కావడం ఇదే మొదటిసారి..కేవలం కాళేశ్వరం రిపోర్టు మీదనే సోమవారం రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏంటీ.. వాటిపై ఎలా స్పందించాలనే దానిమీద బీఆర్ ఎస్ ముఖ్యనాయకులతో కేసీఆర్ ఫాం హౌజ్‌లో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసంది. అలాగే కల్వకుంట్ల కవిత బీసీ రిజర్వేషన్ల విషయంలో మూడు రోజుల నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెల్సిందే.. కవిత చేస్తున్న దీక్షపై కూడా బీఆర్ ఎస్ నేతలు చర్చిస్తోన్నట్లు తెలిసింది.
………………………………………………….