
* కమ్చట్కా ద్వీపకల్పం అగ్నిపర్వత విస్ఫోటనం
ఆకేరున్యూస్ డెస్క్: ప్రకృతి ప్రకోపానాకి రష్యా అల్లకల్లోలం అవుతోంది, వారం రోజుల క్రితమే రష్యాలో అతి పెద్ద భూకంపం రాగా మళ్లీ ఆదివారం రష్యాలోని కురిల్ దీవులలో శక్తివంతమైన భూకంపం వచ్చింది, కురిల్ దీవులకు సమాపంలో ఉన్న కమ్చట్కా ద్వీపకల్పంతో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి, 600 సంవత్సరాలుగా నిద్రాణంగా ఉన్న క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. ఈ విస్ఫోటనంతో సుమారు 6,000 మీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగసిపడినట్లు రష్యా అధికారులు తెలిపారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS), జపాన్ వాతావరణ శాఖ నివేదికల ప్రకారం, రష్యా కురిల్ దీవుల తీరంలో రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో భూకంపం నమోదైంది. దాదాపు 60 కి.మీ లోతులో భూకంపం వచ్చినట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు, దీంతో తీర ప్రాంతంలో బలంగా ప్రభావం కన్పించింది. సునామీ వచ్చే అవకాశాలు ఉండడంతో ప్రజలు భయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారుఅయినప్పటికీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు..
………………………………………..