
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రష్యా కాన్సుల్ జనరల్ భేటీ అయ్యారు. చెన్నైలోని రష్యా కాన్సుల్ జనరల్ వలెరీ ఖుజ్కవ్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి జొన్నలగడ్డ స్నేహజ )తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రష్యా కాన్సుల్ జనరల్‌కు శాలువ కప్పి సత్కరించారు. అనంతరం కీలక అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం..
……………………………………………….