
ఆకేరు న్యూస్ డెస్క్ : క్రికెట్ చరిత్రలో సచిన్ అందుకోలేని రికార్డు లేదు. వన్డే, టెస్టుల్లో కలిపి సచిన్ ఏకంగా వంద సెంచరీలు చేశాడు. సచిన్ చేయలేని ఓ పనిని ఈ ముగ్గురు చేసి చూపించారు. ఒకే సీరిస్‌లో 500 పరుగుల మైలురాయి దాటడం సచిన్‌కు సాధ్యంకాలేదు. కానీ, ఒకే సిరీస్‌లో 500+ పరుగులు చేసిన లిస్ట్‌లో సునీల్ గవాస్కర్ (774) ముందున్నారు. ఆయన కోవలోకే ప్రస్తుతం ఇంగ్లండులో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లలో గిల్ (Gill) , జడేజా (Jadeja), రాహుల్ (Rahul) 500 పరుగుల మైలు రాయిని దాటి శభాష్ అనిపించుకున్నారు. ఈ టెస్టు మ్యాచ్ లలో.. రెండో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో గిల్ (Gill) డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెఎల్ రాహుల్ (K.L.Rahul( దాదాపు ప్రతీ మ్యాచ్‌లో రాణిస్తున్నాడు. మూడో టెస్ట్‌లో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) జట్టును గెలిపించేందుకు వీరోచిత పోరాటం చేశాడు. ఇక నాలుగో టెస్ట్‌లో సెంచరీ సాధించి ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి మ్యాచ్‌ను డ్రా చేశాడు. జడేజా ఈ సిరీస్‌లో 500+ పరుగులు , గిల్ 754, కెఎల్ రాహుల్ 532 పరుగులు చేశారు. టీం ఇండియా టెస్ట్ చరిత్రలో ముగ్గురు ఆటగాళ్లు 500+ పరుగులు చేయడం ఇదే తొలిసారి. కాగా, 2007 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సచిన్ 493 పరుగులు చేశాడు.
………………………………………………..