
ఆకేరున్యూస్, హనుమకొండః ఇటీవల నేషనల్ ఆన్లైన్ ఆర్ట్ కాంపిటీషన్ లో పాల్గొన్న హనుమకొండ కు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్, ఆర్టిస్ట్, లెక్చరర్ డాక్టర్ మంజుల సాగంటి వేసిన చిత్రం బెస్ట్ క్రియేటివ్ ఆర్టిస్ట్ అవార్డ్ ను గెలుచుకున్నారు. ఆదివారం నేషనల్ ఆన్లైన్ ఆర్ట్ కాంపిటీషన్ ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్ మంజుల మాట్లాడుతూ కళామతల్లి కి సేవ చేయడం తన అదృష్టమని, చిత్ర కళను నలుదిక్కుల వ్యాపింప చేయడం తన లక్ష్యం అని అన్నారు. కాగా ఆమె గెలుపు పట్ల పలువురు చిత్రకారులు హర్షం వ్యక్తం చేశారు..
………………………………………….