
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : కేంద్ర పభుత్వం ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లను నిషేధించాలని నిర్ణయించడంతో ఎంతో మంది యువకుల జీవితాలు బాగుపడతాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (SAJJANAR)అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం ప్రకటించారు. దీంతో చాలా మంది యువకుల ప్రాణాలు కాపాడడమే కాకుండా యువతకు బంగారు భవిష్యత్ ను ఇచ్చినట్లు అవుతుందని సజ్జనార్ పేర్కొన్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ లపై దూరంగా ఉండాలని తాను ఎప్పటినుండో ప్రచారం చేస్తున్నాని సజ్జనార్ తెలిపారు.యువత అంతా కలిసి సే టూ నో బెట్టింగ్ యాప్స్ అనే ఉద్యమాన్ని ప్రారంభించడం చాలా గర్వంగా ఉందన్నారు.ఇక మందు కూడా యువత ఇలాంటి వాటికి దూరంగా ఉండి కెరీర్ పై దృష్టిపెట్టాలని సజ్జనార్ కోరారు.
…………………………………………………