
Narendra modi visits Telangana
* ఇకపై జైలు నుంచి పరిపాలన ఉండదు
* రాజ్యాంగంలో 130వ అధికరణకు సవరణ బిల్లుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్ డెస్క్ : భారత దేశంలో ఎవరికైనా ఒకటే రూల్.. ఇకపై జైలు నుంచి పరిపాలన ఉండదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బీహార్లోని గయలో శుక్రవారం రూ.13వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో 130వ అధికరణకు సవరణ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఎంజాయ్ చేస్తూ జైలు నుంచి ఆర్డర్లు పాస్ చేసే రోజులు పోయాయన్నారు. ఇకపై ఎంతటి నాయకుడైనా 30 రోజులు జైలు శిక్షను అనుభవిస్తే ఆ నాయకుడు పదవీ కోల్పోనున్నాడన్నారు. దేశంలో ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు ఇలా ఎవరికైనా ఒకటే రూల్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
……………………………………………………..