* శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో 13 విమానాలు రద్దు అయ్యాయి. వాటిలో 5 ఇండిగో, 2 ఎయిర్ ఇండియా విమానాలు కూడా ఉన్నాయి. మంచు కారణంగా ఢిల్లీలో వాతావరణం అనుకూలించక రద్దు చేసినట్లు ఎయిర్ లైన్స్ అధికారులు వెల్లడించారు. శంషాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏడు విమానాలు రద్దు అయ్యాయి. అలాగే ఢిల్లీ నుంచి శంషాబాద్ కు రావాల్సిన ఆరు విమానాలు కూడా రద్దు అయ్యాయి. వీటిలో ఐదు ఇండిగో, 1 ఎయిర్ ఇండియా విమానాలు ఉన్నాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
……………………………………………….

