ఆకేరున్యూస్, న్యూఢిల్లీ : ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నియామకం అయ్యారు. ఆయన పదవీకాలం వచ్చే 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం కూడా డిసెంబర్ 10తో ముగియనుంది. 2022 సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ సంజయ్ మల్హోత్రాను రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా కేంద్రం నామినేట్ చేసింది.
………………………………..