* 18న రీఓపెన్
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సంక్రాంతి పండుగ హడావుడి మొదలైంది. రేపట్నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు కాబట్టి ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో శుక్రవారం ఘనంగా సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలలకు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. 18వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇక జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించారు. 17న పునఃప్రారంభం కానున్నాయి. సెలవు దినాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తరగతులు నిర్వహించకూడదని ఇంటర్మీడియట్ బోర్డు ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలను హెచ్చరించింది. ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
………………………………….