
*చెప్పులో రాయి..చెవిలో జోరీగ లాంటి వాడు
* కేసీఆర్ చెంతన చేరి చేటు చేస్తున్నాడు
* జోగినపల్లి సంతోష్ రావు పై కవిత తీవ్ర ఆరోపణలు
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : జోగినపల్లి సంతోష్ రావు అవినీతి తిమింగలం అని
కల్వకుంట్ల కవిత తీవ్ర మైన ఆరోపణలు చేశారు. బీఆర్ ఎస్ పార్టీ నుంచి
బహిష్కరణకు గురైన తరువాత ఆమె మొదటి సారిగా మీడియాతో
మాట్లాడారు. కేసీఆర్ చెంతన చేరి మంచోడిలా నటిస్తూ కేటీఆర్కు
చేటు చేస్తున్నాడని కవిత జోగినపల్లి సంతోష్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు, కుటుంబసభ్యుడిగా ఉండి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తున్నాడని కవిత ఆరోపించారు. తనను అమ్మానాన్నలకు దూరం చేసే కుట్ర చేశాడని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. హరిత హారం పేరుతో సినిమా వాళ్లతో ఫోజులిచ్చి ఫొటోలు దిగడం ఆయనకు అలవాటు అని కవిత అన్నారు. కేసీఆర్ కు మాయమాటలు చెప్పి తన అనుచరులకు పదవులు కట్టబెట్టుతున్నాడని కవిత ఆరోపించారు
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తన క్లాస్ మెట్ నవీన్ రావులకు ఎమ్మెల్సీ పదవులు
కట్టబెట్టారని కవిత ఆరోపించారు. ఊరూ పేరు లేని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
మోకిల్లాలో 750 కోట్లతో విల్లా ప్రాసెక్టు ఎలా వచ్చిందని కవిత ప్రశ్నించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో సంతోష్ అవినీతి దందాను ప్రశ్నించిన పాపానికి ఏడుగురు దళిత యువకులను పోలీసులతో కొట్టంచాడని కవిత విమర్శించారు. ఆ ఏడుగురు యువకులు ఈ రోజు ఏ పనీ
చేసుకోలేని స్థితిలో ఉన్నాయని కవిత ఆన్నరు. వారి కుటుంబాలు
వీధినపడ్డాయని కవిత ఆరోపించారు. ఏడుగురు యువకులను సంతోష్ రావు
కొట్టిస్తే కేటీఆర్ బదనాం అయినాడని కవిత విమర్శించారు. సంతోష్ రాబు హరీష్
రావుతో కలిసి కేసీఆర్ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడని కవిత ఆరోపించారు
కేసీఆర్ ను నమ్మించి నమ్మక ద్రోషం చేస్తున్నాడని అన్నారు. సంతోష్ రావు చెప్పులో రాయి,, చెవిలో జోరీగ లాటి వాడని కవిత అన్నారు.
………………………………