
* మొదటి పుష్కర స్నానమాచరించిన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి
* పుష్కర స్నానమాచరించిన మంత్రి శ్రీధర్ బాబు దంపతులు
ఆకేరున్యూస్, కాళేశ్వరం: పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వర క్షేత్రంలో అంగరంగ వైభవంగా సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. గణపతి పూజతో వేద పండితుల మంత్రోచ్ఛారణలతో ఉదయం 5:44 నిమిషాలకు మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా సరస్వతి పుష్కరాలను ప్రారంభించారు. త్రివేణి సంగమ క్షేత్రంలో ప్రత్యేకపూజలు నిర్వహించి మొదటగా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి సరస్వతి నదిలో పుష్కర స్నానమాచరించారు. అనంతరం మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ దంపతులు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు,హైకోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పుష్కర స్నానాలు ఆచరించారు. ఉదయం వేక్వజామునే త్రివేణి సంగమ తీరాన సరస్వతి నదికి పుష్కరుడుని ఆహ్వానించేె కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
తరలివస్తున్న భక్తజనం
ఉదయం నుండే సరస్వతీ నదిలో పుష్కర స్నానాలు ఆచరించినందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు కాలేశ్వరం ప్రాంతానికి చేరుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన సౌకర్యాలను వినియోగించుకుంటూ త్రివేణి సంఘమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని, మహా సరస్వతిని దర్శించుకొని పునీతులయ్యారు.
భక్తులకు అన్ని సౌకర్యాలు
సరస్వతి పుష్కరాలలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు కలెక్టర్ నేతృత్వంలో ఆయా శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. గత కొద్దిరోజులుగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నేతృత్వంలో ఆయా శాఖల అధికారు భక్తుల సౌకర్యార్థం పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా సౌకర్యాలు కల్పించినట్లు మంత్రి వివరించారు.
………………………………………