
ఆకేరు న్యూస్, డెస్క్ : మహారాష్ట్రలో ఓ సర్పంచ్ హత్య.. రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో తన సన్నిహితుడు అరెస్టు కావడంతో, ఆ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే కూడా తన పదవికి తాజాగా రాజీనామా (Maharashtra Minister Dhananjay Munde Resigns) చేయాల్సి వచ్చింది. మహారాష్ట్ర భీడ్ జిల్లాలో సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ ఇటీవల హత్యకు గురయ్యారు. ఈ కేసులో మహారాష్ట్ర మంత్రి ధనంజయ సన్నిహితుడు వాల్మీక్ కడార్ అరెస్టు అయ్యారు. విపక్షాల ఆందోళనలు, ఆరోపణల నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడణవీస్ సూచన మేరకు ధనుంజయ్ రాజీనామా చేశారు. మంత్రి రాజీనామాను ఆమోదించినట్టు ముఖ్యమంత్రి మీడియాకు తెలిపారు. గవర్నర్ ఆమోదం కోసం పంపించినట్టు వెల్లడించారు
…………………………………………