ఆకేరు న్యూస్, కమలాపూర్ : స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిన్న ప్రారంభం కాగా మండలంలోని 24 గ్రామాలు 246 వార్డులు ఉండగా… ఎంపీడీవో గుండె బాబు తెలిపిన వివరాల ప్రకారం….సర్పంచ్ కి అత్యధికంగా అంబాలలో సర్పంచ్ కి 5 నామినేషన్లు, కమలాపూర్, ఉప్పల్, మాదన్నపేటలో 3,వంగపల్లి, శ్రీరాములపల్లి,ఉప్పల్ పల్లి, మరిపెళ్లి గూడెం, గుండేడు, భీంపల్లి గ్రామాల్లో 2, దేశరాజు పల్లి, గూడూరు, గోపాల్ పూర్, నేరెళ్ల , శంభునిపల్లి, వెంకటేశ్వర్ల పల్లి లో 1 చొప్పున సర్పంచ్ కి నామినేషన్లు దాఖలు అయ్యాయి. మిగిలిన దేశ రాజ్పల్లి , గోపాల్పూర్ , కానిపర్తి, కన్నూరు, కొత్తపల్లి, లక్ష్మీపూర్, మర్రిపల్లి, పంగిడిపల్లి గ్రామాలలో సర్పంచ్ కి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఉప్పల్ మేజర్ గ్రామపంచాయతీలో 14 వార్డులకు గాను అత్యధికంగా 16 నామినేషన్లు దాఖలు అయ్యాయి.అంబాల , ఉప్పల్ పల్లిలో 4, మరిపల్లిగూడెంలో 3,శ్రీరాములపల్లి గూడూరులో 2,కమలాపూర్,భీంపల్లి,శంభునిపల్లిలో ఒక్కటి చొప్పున వార్డు నెంబర్ కి నామినేషన్లు నమోదు అయ్యాయి.
……………………………………….
