*బ్యాంకు సేవలు వినియోగించుకోండి
*ఎస్ బిఐ బ్రాంచ్ మేనేజర్ రాజు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
నూతనంగా ప్రారంభించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) సేవలను మండల ప్రజలు వినియోగించుకోవాలని ఎస్బిఐ చిల్పూర్ బ్రాంచ్ మేనేజర్ ఆరగొండ రాజు కోరారు. మండలంలోని వెంకటేశ్వర పల్లిలో ఏర్పాటు చేసిన ఎస్బిఐ నూతన శాఖను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రజలకు బ్యాంకు సేవలు అందించడంతోపాటు బంగారం పై రుణాలు, వ్యవసాయ రుణాలు ఇచ్చి వారి అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. మీకు సమీపంలోనే ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – చిల్పూర్ బ్రాంచ్ నుండి మీ బ్యాంకింగ్ అవసరాలన్నీ సులభంగా, వేగంగా, పొందవచ్చు అన్నారు. సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్, పర్సనల్ లోన్స్ , గోల్డ్ లోన్స్, అగ్రికల్చర్ లోన్స్, ఏటీఎం డెబిట్ కార్డ్ సదుపాయం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు, డి బి టి సేవలు అందించనున్నట్లు తెలిపారు.
