SBI UPI YONO Services Down
* తీవ్ర ఇబ్బందుల్లో కస్టమర్లు
* ఎస్బీఐ కీలక సూచన
* మధ్యాహ్నం 12:30 తర్వాత సేవలు యథాతథం
ఆకేరు న్యూస్, డెస్క్: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిజిటల్ సేవలు ఎట్టకేలకు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. సాంకేతిక లోపం కారణంగా ఉదయం నుండి నిలిచిపోయిన సేవలను బ్యాంక్ ఇంజనీరింగ్ బృందం సరిదిద్దడంతో మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత డిజిటల్ లావాదేవీలు క్రమంగా పునరుద్ధరించబడ్డాయి.
* యూపీఐ పనిచేయక ఆందోళనలో కస్టమర్లు
సర్వర్ లోపం కారణంగా ఉదయం నుంచి ఎస్బీఐ డిజిటల్ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (PhonePe), భీమ్ (BHIM) వంటి యాప్ల ద్వారా ఎస్బీఐ ఖాతాల నుంచి జరిపే UPI చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి.
* వ్యాపారాలు, షాపింగ్ వద్ద ఇబ్బందులు..
నిత్యం కోట్లాది లావాదేవీలు జరిగే యూపీఐ సేవలు పనిచేయకపోవడంతో కిరాణా షాపులు, పెట్రోల్ బంకులు, కూరగాయల మార్కెట్లు, హోటళ్ల వద్ద కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వస్తువులు కొనుగోలు చేశాక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా ‘Payment Failed’ లేదా ‘Server Error’ అని రావడం వల్ల కస్టమర్లు, వ్యాపారులు అవస్థలు ఎదుర్కొన్నారు.
ఆన్లైన్ బ్యాంకింగ్ స్తంభన.. ఎస్బీఐ అధికారిక యాప్ ‘యోనో’ (YONO) తో పాటు IMPS, NEFT సేవలు కూడా పని చేయకపోవడంతో అత్యవసర ఫండ్ ట్రాన్స్ఫర్లు ఆగిపోయాయి. చేతిలో నగదు లేక, డిజిటల్ పేమెంట్స్ కాక వినియోగదారులు గంటల తరబడి నరకం చూశారు.
* సాధారణ స్థితికి వచ్చిన లావాదేవీలు..
ఈ సాంకేతిక అంతరాయంపై వేగంగా స్పందించిన ఎస్బీఐ సాంకేతిక బృందం, మధ్యాహ్నం 12:30 గంటల కల్లా సమస్యను పరిష్కరించింది. ప్రస్తుతం యూపీఐ, యోనో యాప్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యథాతథంగా పనిచేస్తున్నాయని, కస్టమర్లు ఎలాంటి ఆందోళన లేకుండా లావాదేవీలు నిర్వహించుకోవచ్చని బ్యాంక్ అధికారులు ధృవీకరించారు. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి బ్యాంక్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
