
– దరఖాస్తులను ఆహ్వానించిన ‘కొటక్’
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పేద విద్యార్థుల ఉన్నత చదువులకు కొటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. టాలెంట్ ఉన్న విద్యార్థులకు కొటక్ కన్యా స్కాలర్షిప్లను అందిస్తున్నట్లు ఫౌండేషన్ వెల్లడించింది. కొటక్ మహీంద్రా గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ ప్రకటన విడుదల చేసింది. సైన్స్, మ్యాథ్స్, మెడిసన్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, లా, ఆర్కిటెక్చర్, డిజైన్ తదితర విభాగాలలో గ్రాడ్యుయేషన్ చేయబోయే బాలికలకు 500 స్కాలర్షిప్లను అందించనున్నామని కెఈఎఫ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ హెడ్ ఆరతి కౌల్గుడ్ తెలిపారు. ఎంపికైన వారికి ఏటా రూ.లక్షన్నర చొప్పున 4, లేదా 5 సంవత్సరాల పాటు స్కాలర్షిప్ అందించనున్నారు. అయితే.. బాలికలు కచ్చితంగా 12వ తరగతిలో కనీసం 75ు మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయం ఆరు లక్షల రూపాయల లోపు ఉండి, ఎన్ఆర్ఐఎఫ్ లేదా నాక్ గుర్తింపు పొందిన కళాశాలల్లో ప్రవేశం పొంది ఉండాలని ఆ సంస్థ వెల్లడించింది. అర్హులైన బాలికలు కొటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వెబ్సైట్లోకి వెళ్లి వాట్ విల్ డు.. స్కాలర్షిప్.. కొటక్ కన్యా స్కాలర్‌షిప్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.
……………………………………….