
* విద్యాశాఖపై సమీక్షకు సీఎంకు తీరిక లేదు
* అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా రాజశ్వేర్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కారు హయాంలో ప్రభుత్వ పాఠశాలలు బంద్ అవుతున్నాయని ఎమ్మెల్యే పల్లా రాజశ్వర్ రెడ్డి (Palla Rajeswarreddy) అన్నారు. అయినా విద్యాశాఖపై సమీక్షించే తీరిక సీఎంకు లేదా అని ప్రశ్నించారు. 2014 నుంచి 23 వరకు 30 మంది వీసీలను నియమించి కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. 1053 పాఠశాలలు ఎందుకు బంద్ అయ్యాయని ప్రశ్నించారు. 2 లక్షల మంది విద్యార్థులు ఎందుకు డ్రాప్ అయ్యారన్నారు. చిన్న చిన్న పనులు చేసి పెద్దగా చెప్పుకోవడం మానుకోవాలని హితవు పలికారు. కేఆర్ ఎంబీ.. చంద్రబాబు చెప్పినట్లే నడుస్తోందన్నారు. మన హక్కుగా రావాల్సిన వాటాపై సీఎం రేవంత్ రెడ్డి పోరాడాలని సూచించారు. వైద్య శాఖపైనా సీఎం శ్రద్ధ పెట్టాలన్నారు. హైదరాబాద్లో వాటర్ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయయో చెప్పాలని ప్రశ్నించారు.
వాస్తవాలను మాట్లాడాలి : భట్టి
పల్లా రాజేశ్వర్ రెడ్డి వాస్తవాలను మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Batti Vikramarka) అన్నారు. అసెంబ్లీలో ఆయన వ్యాఖ్యలకు బదులిచ్చారు. విద్యాశాఖలో 11వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 36వేల మంది టీచర్లను బదిలీ చేశారని, 12 మంది వీసీలను నియమించారని వివరించారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి తొలిసారి దళిత వీసిని నియమించినట్లు చెప్పారు. విద్యాసంస్థలు నడుపుతున్న పల్లా రాజశ్వేర్రెడ్డి సలహాలు ఇస్తారని ఆశించామని, అది చేయకపోగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖపై సమీక్షించడానికి సీఎంకు సమయం లేదనడం సరికాదన్నారు.
……………………………………………….