
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : మేడిపల్లి పరిధిలోని బాలాజీ హిల్స్‌లో మహేదర్ రెడ్డి అనే వ్యక్తి భార్య స్వాతిని కిరాతకంగా చంపి శరీర భాగాలను మూసీలో వేసిన నేపధ్యంలో శరీర భాగాలను వెతికేందుకు డీఆర్ ఎఫ్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఆదివారం నుండి డీఆర్ ఎఫ్ బృందాలు స్వాతి శరీర బాగాల కోసం మూసీలో గాలిస్తున్నాయి . బోట్ సహాయంతో గాలింపు చేపట్టాయి. అయితే మూసీలో ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడంతో చాలా దూరం కొట్టుకుపోవచ్చని భావిస్తున్నారు.దాదాపు 10 కిలోమీలర్ల వరకు బృందాలు శరీరభాగాల కోసం గాలించాయి. సోమవారం మధ్యాహ్నం వరకు శరీరబాగాలు లభ్యం కాలేదు.
డీఆర్ ఎఫ్ బృందాలు ఇంకా గాలింపులు కొనసాగిస్తున్నాయి.
…………………………………….