* పార్టీ కార్యాలయం ఎదుట మోహరించిన పోలీసులు
* మాజీ ఎంఎల్ ఏ రేగా కాంతారావు సమావేశంపై ఉత్కంఠ
ఆకేరు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ప్రజలు గుంపులుగా ఉండవద్దని పోలీసులు హెచ్చరించారు. పార్టీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ తరుణంలో ఆయన వ్యాఖ్యలపై ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి అవాంచనీయ సంఘటన జరుగకుండా పార్టీ కార్యాలయం వద్ద పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. పినపాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేగా కాంతారావు విజయం సాధించి కొద్దికాలం తరువాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాడు. ఆ సమయంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాంతారావు.. బీఆర్ ఎస్ పార్టీ ఆఫీసుగా మార్చారు. దీనిపై అప్పట్లోనే కాంగ్రెస్ కార్యకర్తలు రేగాకాంతారావు తీరుపై మండిపడ్డారు. ప్రస్తుతం గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన రేగా కాంతారావు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లు గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో మళ్లీ కార్యాలయ వివాదం తెరమీదకు వచ్చింది.
………………………………………..
