
ఆకేరున్యూస్ హైదరాబాద్ : జూబ్లీహిల్స్ (JUBLEE HILLS))ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ (NAVEEN YADAV) ను గెలిపించాలని కోరుతూ ఒకప్పటి సినీ హీరో క్యారెక్టర్ నటుడు భానుచందర్( BHANUCHANDER) ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ మేరకు ఆయన నవీన్ యాదవ్ కు గొప్ప నేత అయ్యే లక్షణాలు ఉన్నాయని ఆయనకు మంచి రాజకీయ భవిష్యత్ ఉందని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని భానుచందర్ కోరారు. భానుచందర్ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే జూబ్లీ హిల్స్ టికెట్ కోసం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా ప్రయత్నం చేసిన విషయం తెల్సిందే. నవీన్ కుమార్ యాదవ్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉండడమే కాకుండా చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాడు. నియోజకవర్గంలో మంచి పట్టు ఉండడమే కాకుండా తన తండ్రిలాగానే ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనే పార్టీ అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించినట్లు చెప్తున్నారు.
……………………………………